ధర్మవరంలో నేడు మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి

85చూసినవారు
ధర్మవరంలో నేడు మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి
ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా గల ప్రజలు గురువారం ఉదయం 9గంటలకు నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని శ్రీచౌడేశ్వరి దేవి సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణ కేంద్రంలోని మదీనా మసీదు ఎదురుగా ఉన్న సాంస్కృతిక మండలిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రక్తదాతలు విరివిగా విచ్చేసి మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్