ధర్మవరం పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు పోలా ఫంక్షన్ హాల్ లో ఆదివారం జిల్లా రచయితల సంఘం వారి కవి సమ్మేళనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ వారి శిష్య బృందం ఆలపించిన నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. చేనేత కష్టాల గురించి, వృద్ధాప్యపు విలువలు గురించి బాబు బాలాజీ రామ లాలిత్య పాటలు రాసి గానం చేసిన వైనం అందరినీ ముగ్ధుల్ని చేసింది.