విద్యుత్ ధరలు తగ్గించాలని ధర్మవరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఎం నేతలు ఆదివారం నిరసన తెలిపారు. కరెంటు బిల్లులు దహనం చేసి, ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచాలనే నిర్ణయం వెంటనే పునఃసమీక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎన్హెచ్ బాషా, సీఐటీయూ మండల నాయకులు జేవీ రమణ, తదితరులు పాల్గొన్నారు.