రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రం రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బుధవారం కలిశారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆయనకు అందజేశారు. రాష్ట్ర అభివృద్ధికి, ధర్మవరం అభివృద్ధికి సహకరించాలని కేంద్రం మంత్రిని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.