నిందితునికి ఏడాది జైలు శిక్ష

569చూసినవారు
నిందితునికి ఏడాది జైలు శిక్ష
ఓ మహిళను కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరచిన కేసులో గుంతకల్లు పట్టణానికి చెందిన షేక్ బాబాఫకృద్దీన్ అను నిందితునికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1000లు జరిమానా విధిస్తూ శుక్రవారం గుత్తి సీనియర్ అసిస్టెంట్ షెషన్స్ కోర్టు న్యాయాధికారి కాశీవిశ్వనాథ్ ఆచారి తీర్పు వెల్లడించారు. 2018 డిసెంబర్ 15న గుంతకల్లుకు చెందిన బోయ హేమలతను షేక్ బాబాఫక్రుద్దీన్ కత్తితో పొడిచాడు. ఈ ఘటనపై నాడు పోలేసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్