గుత్తితో పాటు చుట్టుపక్కల రహదారులు, కొండలను శనివారం పొగ మంచు కప్పేసింది. రహదారులు కనిపించడం లేదు. పూర్తిగా పొగ మంచు అలుముకుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 44, 67వ జాతీయ రహదారుల్లో పొగ మంచు తీవ్రంగా ఉండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇంత దట్టంగా పొగ మంచు అలుముకున్న దృశ్యాలను ఎప్పుడూ చూడలేదని ప్రజలు అంటున్నారు.