లేపాక్షి మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో వీఆర్ఏ రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. లేపాక్షి ఎస్ఐ నరేంద్ర తెలిపిన వివరాల మేరకు ఆదివారం అర్ధరాత్రి మద్యం తాగిన అశ్వర్ధ అనే వ్యక్తి తన సోదరుడైన వీఆర్ఏ రామాంజనేయులతో ఘర్షణ పడి మెట్లపై నుంచి తోయడంతో రామాంజనేయులు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటనపై అస్వర్ధను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.