కదిరి పట్టణంలో వెలసిన శ్రీఅయ్యప్ప స్వామి సన్నిధానం నందు 48వ మండల పూజ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్వామికి 48కేజీలతో నెయ్యాభిషేకం శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ననిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గణపతి హోమము నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం 1: 30 నుండి కన్నె పూజ జరుగుతుంది. గురువారం ఉదయం మహా గణపతి హోమము, మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీఅయ్యప్ప స్వామి రథోత్సవం తిరు వీధులలో ఊరేగింపు జరుగుతుంది.