కళ్యాణదుర్గం మండలంలోని హులికల్లు గ్రామంలోని ప్రభుత్వ 34వ రేషన్ షాపును సీజ్ చేసినట్లు డిప్యూటీ తహశీల్దార్ సుబ్రహ్మణ్యం గురువారం విలేఖరులకు తెలిపారు. రెవిన్యూ సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా బియ్యం నిల్వలు తక్కువ చూపించారని తెలిపారు. కార్డుదారులకు పంపిణీ చేసిన వాటికి, నిల్వ ఉన్న వాటికి సరిపోకపోవడంతో సీజ్ చేసినట్లు వెల్లడించారు.