శ్రీసత్య సాయి జిల్లా మడకశిర టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన ఎమ్మెస్ రాజు గన్నవరంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 12న ఉండడంతో ముందుగానే కలిశారు. మడకశిర సమస్యలు వివరించారు. ప్రమాణ స్వీకారాన్ని మడకశిర టిడిపి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.