రొళ్ల మండలం కాకి గ్రామంలో రైతు తిమ్మేగౌడ్ కు చెందిన మల్బరీ షెడ్, పక్కన ఉన్న గడ్డి వాము శనివారం దగ్దమైంది. తన పొలంలో పుట్ట పురుగులు మేపడానికి మల్బరీ షెడ్ కట్టుకున్నారు. ఆలాగే తాను పెంచుకున్న పాడి పశువుల కోసం ఎండు గడ్డి ఉంచారు. ఉన్నపళంగా నిప్పు అంటుకుని షెడ్ తో పాటు వాము కూడ పూర్తిగా కాలిపోయింది. అగ్ని మాపక సిబ్బంది వచ్చే సరికి ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు.