పెనుకొండ మండలం మునిమడుగు ఘటనపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించారు. బుధవారం గ్రామంలో ఓ మహిళ జుట్టును కత్తిరించిన సంఘటన నేపథ్యంలో పెనుకొండ డిఎస్పి వెంకటేశ్వర్లు, పెనుకొండ సీఐ రాఘవన్ గ్రామానికి వెళ్లి గ్రామంలో ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త తీసుకుని పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. డిఎస్పీ మాట్లాడుతూ ఎవరు ఏటువంటి గొడవలు చేసిన పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డిఎస్పి హెచ్చరించారు.