సోమందేపల్లి: హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు నిలిపివేయాలి

69చూసినవారు
సోమందేపల్లి: హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు నిలిపివేయాలి
హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్ డిమాండ్ చేశారు. సోమందేపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు చేయాలని బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగిందని ఇది రైతులకు చేస్తున్న పెద్ద ద్రోహమైన చర్యని, లైనింగ్ పనుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి జిల్లా ఎడారిగా మారుతుందన్నారు.

సంబంధిత పోస్ట్