పుట్టపర్తి మున్సిపాల్టి పరిదిలోని ఎస్బిఐ రోడ్లో డ్రైనేజి పొంగి రోడ్లమీద నీరుపారడంతో మంగళవారం స్థానిక ప్రజలు మున్సిపల్ కమీషనర్ ప్రహళ్లాద దృష్టికి తీసుకెళ్లారు. సమస్య ను జిల్లా టీడిపి కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ద్వారా తెలిపారు. కమీషనర్ వెంటనే స్పందించి మున్సిఫల్ కార్మికులద్వార డ్రైనేజిని శుభ్రపరచి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. సమస్యపై వెంటనే స్పందించి శుబ్రం చేయించినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.