రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ పుట్టపర్తిలోని కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా పోలీసులు కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. శ్రీ సత్యసాయి జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.