కొత్తచెరువు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో కట్టెలు ఓవర్ లోడ్ లారీ శనివారం రాత్రి 10 గంటల సమయంలో లారీ స్పీడ్ తో వెళ్లడం వల్ల విద్యుత్ వైర్లు ఆ లారీకి తగిలి ఒక స్తంభం కింద పడిపోవడమే గాక వైర్లు తెగిపోయాయి. అయితే అక్కడ ప్రజలు లేకపోవడంతో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. వెంటనే పోలీస్ వారు, విద్యుత్ ఎ. ఇ. వెంకటేష్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.