రాప్తాడు మండలం పుల్లలరేవులో వైసీపీ కార్యకర్త కు చెందిన తోటలోని నేరేడు చెట్లను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 15 నేరేడు చెట్లను నరికి వేశారు. బాధిత రైతు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాప్తాడు పోలీసులు నేరేడు చెట్లు నరికి వేసిన తోటను పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.