రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కళ్యాణదుర్గం పట్టణంలో జరిగిన వివాహానికి బుధవారం హాజరయ్యారు. అనంతరం ఆమె కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇంటికి మర్యాదపూర్వకంగా వెళ్లారు. ఈ సందర్భంగా సురేంద్రబాబు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను సన్మానించారు. ఇద్దరు కాసేపు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు గురించి చర్చించారు.