రాయదుర్గం ఐసిడిఎస్ సిడిపిఓగా బాధ్యతలు చేపట్టిన పద్మావతి

57చూసినవారు
రాయదుర్గం ఐసిడిఎస్ సిడిపిఓగా బాధ్యతలు చేపట్టిన పద్మావతి
రాయదుర్గం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓగా ఏఎల్ పద్మావతి గురువారం బాధ్యతలు చేపట్టారు. రాయదుర్గం సిడిపిఓగా ఉన్న ప్రభావతమ్మ పదవీ విరమణ పొందడంతో మడకశిర నియోజకవర్గం గుడిబండ ప్రాజెక్టులో సిడిపిఓగా విధులు నిర్వహిస్తున్న పద్మావతిని ఉన్నతాధికారులు ఇటీవల రాయదుర్గంకు బదిలీ చేశారు. దీంతో ఆమె గురువారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్