కణేకల్ మండలం బిదురుకొంతం- ఉరవకొండ మండలం వ్యాసపురం గ్రామాల మధ్య ఉన్న వంతెన శనివారం అకస్మాత్తుగా కుప్పకూలింది. బిదురుకొంతం గ్రామ రైతులు మిరప, జొన్న, పొద్దు తిరుగుడు, తదితర పంటలు రబీ సీజన్ కింద సాగు చేశారు. దీంతో ఎద్దుల బండ్లు పొలాల్లోకి వెళ్లేందుకు ఇబ్బందికర పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.