రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి

58చూసినవారు
రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి
రాయదుర్గం మండలం గ్రామదట్ల గ్రామానికి చెందిన గొల్ల మల్లికార్జున ఆత్మకూరు వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి అనంతపురం నుండి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మల్లికార్జున తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అతన్ని అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్