రాయదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి బలపరిచిన రైతన్నలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చారిత్రక ఘట్టమని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. కణేకల్ మండలంలో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పడం ఆత్మహత్యా సదృష్టమైనదిగా భావిస్తున్నామని తెలిపారు.