యల్లనూరు: టపాసుల దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి
యల్లనూరు మండలంలో ఎవరైనా టపాసుల దుకాణాలు నిర్వహించాలంటే లైసెన్స్ తప్పనిసరి అని రూరల్ సిఐ సత్యబాబు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసు, సంబంధిత అధికారుల నుండి తప్పనిసరిగా అనుమతులు పొందిన తరువాత మాత్రమే బాణసంచా అమ్మకాలు చేయాలన్నారు. బాణసంచా షాపులను ప్రజల నివాస ప్రదేశాలకు దూరంగా వున్న బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు.