శింగనమల: ఇసుక ప్రాంతాల్లో పోలీసుల గస్తీ
శింగనమల మండలంలో పెన్నానది వంక ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను తరలించకుండా రెవెన్యూ సిబ్బందితో కలసి పోలీసుల గస్తీ సోమవారం ఏర్పాటు చేశారు. మండలంలోని వంక ప్రాంతాలల్లో అక్రమ ఇసుక తరలింపుపై ఫిర్యాదులు రావడంతో తహశీల్దార్ సాకే బ్రహ్మయ్య, సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ శరత్ చంద్ర పలు గ్రామాల్లోని వంక ప్రాంతాల్లో పోలీసుగస్తీతో పాటు రెవెన్యూ సిబ్బందిని కాపాలా ఉంచారు.