గార్లదిన్నె: నగదు, మొబైల్ ఫోన్ తో యువకుడు పరారీ
కూలీ పనికోసం గార్లదిన్నెకు వలస వచ్చిన ఉత్తరప్రదేశ్ కు చెందిన మంగల్ అనే యువకుడు రూ. 20 వేలు నగదు, మొబైల్ ఫోన్ తీసుకొని పారిపోయాడని బాధితుడు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గార్లదిన్నెలో డ్యామ్ రోడ్డు సమీపంలో పానీపూరి బండి నడుపుకొంటున్న ఒడిస్సాకు చెందిన వ్యక్తి దగ్గర కూలీ పనులు చేసుకుంటూ ఉండేవాడు. రెండు రోజుల కిందట నగదు, మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్లిపోవడంతో గురువారం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.