సింగనమల: విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఆపండి
సింగనమల మండల కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల ప్రజాపోరు జరిగింది. బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ బ్రహ్మయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ, ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల వ్యవస్థను తక్షణమే నిలిపివేయాలన్నారు.