సోమందేపల్లి మండలంలోని నాగినాయినిచెరువు గ్రామ పంచాయతీలో జన సురక్ష ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరస్యత అవగాహన గురించి చర్చించడం జరిగింది. ప్రతి ఒకరికీ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా, సైబర్ నేరాలు, రూపే కార్డు గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంకు డిప్యూటీ మేనేజర్ సురేష్, వీడ్స్ సిఫ్ఎల్ కౌన్సిలర్స్ అజయ్, చాలెంజ్ రాముడు, రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ డీవి ఆంజనేయులు జనార్దన్, గంగాధర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.