తాడిపత్రిలో ఎస్బీఐ ఏటీఎంలో అగ్నిప్రమాదం

63చూసినవారు
గురువారం సాయంత్రం తాడిపత్రి పట్టణంలో ఓ ఎస్బీఐ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఏటీఎం నుంచి పోగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక అధికారి మోహన్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని మంటలు అర్పివేయడానికి ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని వారు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్