అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు చీని చెట్లను నరికి వేసిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పెద్దపప్పూరు మండలంలో రెడ్డిపల్లి గ్రామంలో మహిళ రైతు వెంకటలక్ష్మి తన వ్యవసాయ పొలంలో చీని పంటను సాగుచేస్తుంది. అయితే రాత్రి వేళలలో 50 చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేసినట్లు బాధితురాలు వెంకటలక్ష్మి వాపోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.