తనకల్లు మండలం కోర్తికోట గ్రామంలో సీతారాములు వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ బుధవారం పాల్గొన్నారు. సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.