ఈనెల 10న వాహనాలకు బహిరంగ వేలం పాట

66చూసినవారు
ఈనెల 10న వాహనాలకు బహిరంగ వేలం పాట
ఉరవకొండ సెబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ నేరాలలో పట్టుబడిన వాహనాలకు ఈనెల 10వ తేదీన బహిరంగ వేలం వేయనున్నట్లు ఉరవకొండ సెబ్ అధికారి కిషోర్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని, డిపాజిట్ రూ. 5వేలు కట్టి ఎంట్రీ పాస్ తీసుకోవాలని సూచించారు. ప్రతి ద్విచక్రవాహనంపై 18 శాతం జీఎస్టీ ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్