ఉరవకొండ మండలం నెరిమెట్ల గ్రామంలో వ్యవసాయ అధికారులు మంగళవారం రైతులతో సమావేశం నిర్వహించారు. మిరప పంట సస్యరక్షణ చర్యలు, ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు అగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్త డాక్టర్ యుగంధర్, మండల ఉద్యాన అధికారి నెట్టి కంట్టయ్య, కిన్నెర, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.