బద్వేలు నియోజకవర్గంలో కొన్ని రోజులుగా చలితీవ్రత తగ్గడం లేదు. ఉదయం, సాయంత్రం చలి గాలులకు జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. సోమవారం తెల్లవారుజామున గ్రామ పరిసరాలన్నీ మంచు దుప్పటి కప్పుకున్నట్టు కనిపిస్తున్నాయి. వంద మీటర్ల దూరంలోని వ్యక్తులు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. మండలంలోని కొందరు చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు.