ముద్దనూరు: శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే చర్యలు

75చూసినవారు
ముద్దనూరు: శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే చర్యలు
ముద్దనూరు మండలంలో నూతన మద్యం దుకాణం ప్రారంభోత్సవంలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం ముద్దనూరులో పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీస్పీ తెలిపారు. కార్యక్రమంలో ముద్దనూరు సీఐ దస్తగిరి, జమ్మలమడుగు సీఐ లింగప్ప, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్