కడప జిల్లా ముద్దనూరు మండలం బొందలకుంట గ్రామంలో బుధవారం వ్యవసాయాధికారులు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఓ వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతు సాగు చేసిన పంటలో రసం పీల్చే పురుగుల నివారణకు జిగురు అట్టలు మంచి ఉత్తమ పద్దతని తెలిపారు. పూత దశలోనే కలుపు మొక్కలు కోసి వేసి కాల్చి వేయాలని రైతులకు తెలిపారు.