దక్షిణ కొరియా ఫౌండేషన్ 2024 సంవత్సరానికి అత్యుత్తమ విదేశీ పరిశోధనలకు ఇచ్చే బ్రెయిన్ ఫూల్ ఫెలోషిప్ యోగి వేమన విశ్వవిద్యాలయం మెటీరియల్ సైన్స్ నానో టెక్నాలజీ ఆచార్యులు ఎంవి శంకరకు లభించడం దేశం గర్వించదగ్గ విషయమని విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు మూల మల్లికార్జున రెడ్డి అన్నారు. బుధవారం శంకర్ దక్షిణ కొరియా వెళుతున్న సందర్భంగా కడప వేమన నగర్ లో ఆయన స్వగృహంలో విదేశీయాన వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.