కమలాపురం: 22 నుంచి మొబైల్ ఆధార్ కేంద్రాలు

51చూసినవారు
కమలాపురం: 22 నుంచి మొబైల్ ఆధార్ కేంద్రాలు
కమలాపురం పట్టణంలోని ఒకటో సచివాలయం, మండలంలోని టి. చదిపిరాళ్ల సచివాలయాల్లో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు మొబైల్ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ డీవో జ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధార్ కార్డులో చిరునామా, ఫొటో మార్పు, 0 నుంచి 5 ఏళ్ల వయసు పిల్లలకు ఆధార్ అప్డేట్, ఫోన్ నంబరు లింక్, వేలిముద్రలు అప్ డేట్ చేస్తారని చెప్పారు. ప్రజలు మొబైల్ ఆధార్ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్