స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు కలెక్టర్ చే ప్రశంసాపత్రాలు

82చూసినవారు
స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు కలెక్టర్ చే ప్రశంసాపత్రాలు
మైదుకూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు గణతంత్ర దినోత్సవ సందర్భంగా కడప పోలీస్ గ్రౌండ్ లో జరిగిన కవాతు మార్చ్ పాస్ట్ లో పాల్గొని మంచి ప్రతిభ కనపరిచారు. కవాతు మార్చ్ పాస్ట్ లో పాల్గొన్న పాఠశాల 8వ తరగతి చదువుతున్న మహేష్, సూర్యతేజ, నజీర్, అల్తాఫ్ తదితర విద్యార్థులను శనివారం జిల్లా కలెక్టర్ విజయరామరాజు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ప్రశంసా పత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్