మైదుకూరు పట్టణంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన జయంతి ఏప్రిల్ 14న ఆవిష్కరించుకునేలా సహకరించాలని మునిసిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాసులురెడ్డికి మంగళవారం ఎమ్మార్పీ ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలోని సమాఖ్య నాయకులు విగ్రహం ఏర్పాటుపై కమిషనర్ చర్చించారు. ప్రభుత్వ నిధులతో విగ్రహం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు.