కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల జీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామాల్లో శుద్ధి నీరు అందించే ప్లాంట్లకు మరమ్మతులు చేపట్టాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ బుధవారం అసెంబ్లీలో కోరారు. గత ప్రభుత్వ హయాంలో శుద్ధి నీరు అందక, ఫ్లోరైడ్ కారణంగా కొన్ని గ్రామాలలోని ప్రజలకు కాళ్లు, చేతులు వంకరగా పోతున్నాయన్నారు. వాటర్ ప్లాంట్లకు మరమ్మతులు చేయాలని అన్నారు.