బ్రహ్మంగారి మఠం మండల టౌన్ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్ కాలనిలో ఆదివారం ఉదయం 10: 00 గంటల నుండి సాయంత్రం 04: 00 గంటకవరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మండల ఏ. ఈ రవిశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. హాస్పిటల్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా పాడవటం వలన క్రొత్త దిమ్మె కడుతున్నట్లు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు.