పీలేరు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుక వైభవంగా జరిగింది. బాబా ఆలయ అర్చకులు శివ ప్రసాద్ స్వామి ఆదివారం మాట్లాడుతూ ఆలయంలో బాబాకు పంచామృత అభిషేకం, అర్చనలు, ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించామన్నారు. దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ తోపాటు మేనేజర్ రాజారెడ్డి, సీన తదితరులు పాల్గొన్నారు.