కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దేకుంట్ల గ్రామంలో శుక్రవారం రాత్రి రైతు నాగేంద్ర కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటనపై, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని డీఎస్పీ మురళి నాయక్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పులివెందుల పట్టణంలోని స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతు కుటుంబం ఆత్మహత్యకు చేసిన అప్పులు తీర్చలేకపోవడమే ప్రధాన కారణమన్నారు.