ట్రాక్టర్ల దొంగతనం కేసులో నిందితుడు ఎర్రగుడిబాబాను అరెస్టు చేసినట్లు పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. గురువారం సాయంత్రం మండల కేంద్రమైన సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసులో ముద్దాయి ఎర్రగుడి బాబాను అరెస్టు చేసి విలేకరుల ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ మాట్లాడుతూ. ఎర్రగుడి బాబా నుంచి ఒక ట్రాక్టర్, మూడు ట్రాక్టర్ ట్రాలీలు, ఒక వాటర్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.