రాష్ట్రంలో అధికారం లో వున్న టిడిపి కూటమి, ప్రతిపక్ష వైకాపా పార్టీ దొందూ దొందే అని మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్, రాజ్య సభ మాజీ సభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్ తులసి రెడ్డి ద్వజమెత్తారు. వేంపల్లిలో సోమవారం ఆయన మాట్లాడుతూ జగన్ అరచేతిలో వైకుంఠం చూపిస్తే, చంద్రబాబు కైలాసం చూపిస్తున్నాడన్నారు. రాయలసీమపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టినట్లుందని వారు విరుచుకు పడ్డారు.