నులి పురుగుల నివారణపై అవగాహన

65చూసినవారు
నులి పురుగుల నివారణపై అవగాహన
రాజంపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కౌమార బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం.. నులిపురుగుల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, విద్యార్థులకు ఆల్బండోజోలు మాత్రలను పంపిణీ చేసి, నులిపురుగులు కలిగించే ఆరోగ్య సమస్యలు వివరించారు. రాజంపేట ఏరియా ఆసుపత్రి నుండి రాష్ట్రీయ కిశోర స్వస్తియ అభియాన్ కార్యక్రమ అధికారి రాజశేఖర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్