బద్వేల్ సబ్ DFO స్వామి వివేకానంద సిద్ధవటం రేంజ్ లోని రోళ్ళబోడు బేస్ క్యాంప్ ని శనివారం ఆకస్మిక తనిఖీ చేసారు. గొల్లపల్లి సెక్షన్ స్టాఫ్ తో కలిసి రోళ్ళబోడు, గొల్లపల్లి, బీట్ల నందు ఎర్రచందనం స్మగ్లర్ల ఆచూకీ కోసం కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ నందు సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి, డిప్యూటీ రేంజ్ అధికారి ఓబులేసు, FBOలు పెంచల్ రెడ్డి, ఆది విశ్వనాథ్, మధు తదితరులు పాల్గొన్నారు.