ప్రజా కవి వేమన జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఉమ్మడి కడప జిల్లా స్థాయిలో రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వేమన పద్య పోటీలకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం నందలూరు నాగిరెడ్డి పల్లిలో ఆవిష్కరించారు. నవంబర్ 10న రాజంపేట లోని బాలికోన్నత పాఠశాలలో వేమన పద్య పోటీలు నిర్వహించనున్నారు. కరపత్రంలో తెలిపిన విధంగా 15 సంవత్సరాలు లోపు విద్యార్థులు 12 పద్యాలను పాడాల్సి ఉంటుంది.