శుక్రవారం రాజంపేట నియోజకవర్గం లోని పులపత్తూరు లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తున్న నేపథ్యంలో అధికారులు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. జనసేన పార్టీ పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు గురువారం అధికారులతో కలిసి పర్యటించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వారిని కోరారు. స్ధానిక నాయకులు గ్రామ ప్రజలు, జనసేన పార్టీ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు.