మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య సేవలు మరవలేనివి

82చూసినవారు
మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య సేవలు మరవలేనివి
టిడిపి రాజంపేట సీనియర్ నాయకులు, దివంగత మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య సేవలు మరువలేనివని ఒంటిమిట్ట మండలానికి చెందిన టిడిపి నేతలు కొనియాడారు. బుధవారం ఒంటిమిట్టలోని బ్రహ్మయ్య సమాధి వద్ద 5వ వర్ధంతి వేడుకలు జరిగాయి. టిడిపి నాయకులు, కార్యకర్తలు, పసుపులేటి బ్రహ్మయ్య అభిమానులు కలిసి బ్రహ్మయ్య సమాధి కి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా నివాళ్ళు అర్పించి జోహోర్ బ్రహ్మయ్య అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్